తెలంగాణ
అక్బరుద్దీన్ ఓవైసీకి మంత్రి సీతక్క కౌంటర్

Seethakka: అక్బరుద్దీన్ ఓవైసీకి మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రజలకు ఇల్లులు ఇవ్వలేదన్నారు మంత్రి సీతక్క. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇండ్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు సీతక్క వెల్లడించారు.
అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దన్నారామె. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా జరిగిన నిర్మాణాలకు తమ ప్రభుత్వం అడ్డుకట్టలు వేస్తోందన్నారు. తమ ప్రభుత్వం పోలీసులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి రోజే జీతాలు ఇస్తోందన్నారు. డ్రగ్స్ , మత్తు పదార్థాల వల్ల మహిళలపై వేధిపులు జరుగుతున్నాయనే వాటిని అరికట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్నామని సీతక్క వెల్లడించారు.