తెలంగాణ
రాహుల్‌గాంధీ అరెస్ట్‌ను ఖండంచిన మంత్రి సీతక్క

ఈసీ అక్రమాలను వేలెత్తి చూపిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అరెస్ట్‌ను తెలంగాణ మంత్రి సీతక్క ఖండించారు. రామ రాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా? అని సీతక్క ప్రశ్నించారు. జై శ్రీరాం నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా? అని సీతక్క నిలదీశారు. బీజేపీ వారు నిజంగా రామ భక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయట పెట్టాలని సవాల్ చేశారు.



