తెలంగాణ
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పైనా కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 13కి వాయిదా వేసింది.