తెలంగాణ
Mahabubabad: మట్టి గోడ కూలి మహిళ మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి గోడ కూలి మహిళ మృతిచెందింది. కోల రామక్క ఒంటరిగా గుడిసెలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయం పొరుగు వారు చూసే సరికి మంచం పై నిద్రిస్తున్న రామక్కపై గోడ కూలి ఉందని.. గమనించి పోలీసులుకు సమాచారం అందించినట్లు చెప్పారు స్థానికులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



