Ponnam Prabhakar: గురుకుల మెనూలో చేపల భోజనం

Ponnam Prabhakar: మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాల్లో భోజన మెనూలో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం సహచర మంత్రి శ్రీహరి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలను వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో మత్స్య శాఖకు 122 కోట్లు కేటాయించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
గతంలో చేపపిల్లల పంపిణీలో విషయంలో అవకతవకలు జరిగాయనీ, ఈ సారి చేపపిల్లల పంపిణీ పారదర్శత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారులకు కోటి 40 లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామన్నారు.



