తెలంగాణ
Ponnam: ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే

Ponnam: యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి బీఆర్ఎస్ నేతలు రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల్లో 60 శాతం మాత్రమే కేంద్రం నుంచి వచ్చిందన్నారు.



