తెలంగాణ
Ponnam Prabhakar: ఆటో నడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూసఫ్‌గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని పొన్నం కోరారు. అలాగే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పొన్నం స్పష్టం చేశారు.



