తెలంగాణ

Ponnam: ఉపాధి కోసం వచ్చేవారికి ఈ క్యాంటీన్లు ఉపయోగపడుతాయి

Ponnam: హైదరాబాద్ పరిధిలోని బాగ్ లింగంపల్లి సందరయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నగరానికి ఉపాధి కోసం వచ్చేవారికి, పేదలకు ఈ క్యాంటీన్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడా ఈ క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button