తెలంగాణ
Ponnam Prabhakar: బీసీ విభాగం సెమినార్ హాల్ ప్రారంభించిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. అక్కడ బీసీ సెల్ కార్యాలయం, వ్యవసాయ కళాశాల అనుబంధ సెమినార్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. విశ్వవిద్యాలయంలో బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ ఉద్యోగస్తులను, విద్యార్థులను అందరూ కలిసేలా బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
బలహీన వర్గాల ప్రాతినిథ్యానికి జరుగుతున్న పోరాటంలో రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొంటున్నాయన్నారు. కులగణన జరిపిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం లాగ అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పొన్నం పిలుపునిచ్చారు.



