తెలంగాణ
అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్

ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అశ్వరావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామని, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి అన్నారు. అశ్వరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్ల కోసం కమిషన్లు అడుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని నిజనిర్దారణ చేయాలని తాసీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. నాచారంలో రామాలయం దేవాలయ నిర్మాణానికి 52 వేల రూపాయల నగదును మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గ్రామస్తులకు అందజేశారు.