ఆంధ్ర ప్రదేశ్
న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటన

విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ఎమ్మెల్యే బోండా ఉమా,వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి పర్యటించారు మంత్రి నారాయణ. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డీఎంహెచ్ ఓ సుహాసిని, మున్సిపల్ అధికారులతో చర్చించారు.
ఆ తర్వాత కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు మంత్రి నారాయణ. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వదంతులు నమ్మవద్దని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే బోండా ఉమ.



