ఆంధ్ర ప్రదేశ్

Narayana: గ్రేటర్ హోదాపై మంత్రి నారాయణ క్లారిటీ

Narayana: తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపై చర్చించలేదని తెలిపారు. జనగణన జరగబోతోంది కాబట్టి ప్రస్తుతం డీలిమిటేషన్ చేయకూడదనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు.

జరీబు, నాన్ జరీబు భూములపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా సమస్య పరిష్కరిస్తామన్నారు. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్‌లో 42మంది మార్పులు కోరారని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్ మార్చుకోవాలనుకునే అన్నదాతలు దరఖాస్తు చేసుకుంటే వాటిని మారుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button