ఆంధ్ర ప్రదేశ్
Narayana: నెల్లూరులోని వీఆర్ హై స్కూల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం

Minister Narayana: నెల్లూరులోని వీఆర్ హై స్కూల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య అందించనున్నట్లు ఆయన తెలిపారు. తాను చదివిన వీఆర్ హై స్కూల్‌ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. వీఆర్ తరహాలో మరో రెండు స్కూల్స్‌ను సిద్దం చేసేందుకు డీఎస్ఆర్ కంపెనీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముందుకొచ్చారని అన్నారు.