ఆంధ్ర ప్రదేశ్
Nadendla Manohar: తెనాలి ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు

Nadendla Manohar: రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెనాలి ప్రజలందరికీ మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలందరి కృషితోనే అధికారంలోకి వచ్చామన్నారాయన. గత ప్రభుత్వంలో గాడి తప్పిన అన్ని వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటూ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేస్తున్నామన్నారు.
తెనాలి నియోజకవర్గానికి అన్ని శాఖల నుండి 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని నాదెండ్ల వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.