ఆంధ్ర ప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు.

గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుందని తెలిపారు. దీనివల్ల ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేష్ చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button