ఆంధ్ర ప్రదేశ్

Kollu Ravindra: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం

Kollu Ravindra: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న ప్రజలను కలిసి ధైర్యం చెప్పారు రవీంద్ర. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. పునరావాస కేంద్రాలల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 3 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు 50 కిలోల బియ్యం అందిస్తామన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button