ఆంధ్ర ప్రదేశ్
చీరాల మున్సిపల్ చైర్మన్‌గా మించాల సాంబశివరావు

Chirala Municipal Chairman: బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ చైర్మన్‌గా మించాల సాంబశివరావు ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. 19వ వార్డు కౌన్సిలర్ మించాల సాంబశివరావు పేరును ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రకటించగా మెజార్టీ సభ్యులు ఆమోదించారు.
సాంబశివరావు ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి ఆయనతో ప్రమాణం చేయించి పత్రాలు అందించారు. పదవిపై ఆశలుపెట్టుకున్న 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్ప డుతానంటూ కౌన్సిల్ హాలు నుండి వెళ్ళి పోయారు. సీఎం చంద్రబాబు తనను మోసం చేశారని సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు.