క్రీడలు

MI vs SRH: ఇవాళ ముంబై ఇండియన్స్‌తో సన్ రైజర్స్ అమీతుమీ

MI vs SRH: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ ఇవాళ మరోసారి ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్‌ ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోంది.

ఈ సీజన్‌లో ఆడితే బ్రహ్మండం లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్‌ఆర్‌హెచ్‌ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్‌ ఆర్మీ ఉప్పల్‌లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది.

మరోవైపు గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌ అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్‌లో ఆడిన తొలి 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాత గాడిన పడింది.

స్టార్‌ పేసర్‌ బుమ్రా వచ్చాక బౌలింగ్‌ మరింత రాటుదేలగా గత మ్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button