తెలంగాణ
ప్రభుత్వానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్

ప్రభుత్వానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని అన్నారు. చీకటి జీవోలతో భూములను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. 6లక్షల 29 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు ఎట్లా గండి కొడుతున్నారో రుజువు చేస్తా అని అన్నారు.
హిల్ట్ స్కామ్ జరిగిందని సాక్ష్యాధారాలతో రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఉత్తమ్‌కు, మంత్రుల సబ్ కమిటీ దమ్ముందా అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దే కూర్చుంటా. ఉత్తమ్ వస్తారా ? సబ్ కమిటీ సభ్యులు వస్తారా..రండి అని అన్నారు.



