తెలంగాణ
మేడిపల్లి స్వాతి హత్య కేసు దర్యాప్తు వేగవంతం

మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు, కాళ్లను కవర్‌లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసీలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు, కాళ్లు దొరకలేదు. పది కిలో మీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసీ ప్రవాహం ఎక్కువ ఉండటంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి.
గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు.



