తెలంగాణ
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మేయర్ విజయలక్ష్మి పర్యటన

Mayor Vijayalaxmi: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. జూబ్లీహిల్స్ పార్క్ స్థలం కబ్జాపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పార్క్ స్థలాన్ని ఫాంహౌస్‌లా వాడుకుంటున్నా రని ఫైర్ అయ్యారు. అయితే పార్క్ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా కబ్జాకు గురైన 2వేల గజాలను స్వాధీనం చేసుకోవాలని.. అధికారుల కు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. సాయంత్రంలోపు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని.. స్థలాన్ని క్లీన్ చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు.