తెలంగాణ
Hyderabad: పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్ షోరూంలో చెలరేగిన మంటలు

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు, కారు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయని స్థానికులు చెప్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



