ఆంధ్ర ప్రదేశ్
Fire Accident: కోవూరు పట్టణంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: నెల్లూరు జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోవూరు పెళ్లకూరు కాలనీ, మొదటి వీధిలో మంటలు చెలరేగాయి. స్క్రాప్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడటంతో పొగ దట్టంగా అలుముకుంది. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు రాజుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.