ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం

Vijayawada: విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూ పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.



