Peddi:‘పెద్ది’ గ్లింప్స్‌పై మాస్ అప్డేట్

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “పెద్ది” గురించి లేటెస్ట్ బజ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ చిత్రం, “గేమ్ ఛేంజర్” డిజప్పాయింట్మెంట్ తర్వాత కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, ఇప్పుడు గ్లింప్స్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి.
రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ ఉన్నప్పటికీ, టెక్నికల్ వర్క్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు హాట్ టాక్ ఏంటంటే ఈ గ్లింప్స్ ఉగాది రోజున స్పెషల్ సర్ప్రైజ్గా వస్తుందని తెలుస్తుంది. అయితే, ఇందులో సినిమా రిలీజ్ డేట్ ఉంటుందా అనేది ట్విస్ట్‌గా మారింది.
ఇండస్ట్రీ బజ్ ప్రకారం, గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో రానుందట. ఈ వార్త నిజమా కాదా అనేది ఉగాది రోజు తేలిపోనుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఈ గ్లింప్స్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.