సినిమా

Mass Jathara: అదరగొడుతున్న ‘మాస్ జాతర’ ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్!

Mass Jathara: రవితేజ హీరోగా, ఎనర్జిటిక్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా యువ దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం మాస్ జాతర. మాస్ ఎంటర్‌టైనర్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానులను ఊరిస్తోంది.

సంగీత దర్శకుడు భీమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి వాయిస్‌ను ఉపయోగించి ఈ సాంగ్‌ను సూపర్ హిట్‌గా మార్చారు. రవితేజ ఎనర్జీ ఈ పాటలో బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది.

మధ్యలో ఇడియట్ ట్యూన్‌కు రవితేజ స్టెప్పులు పాత రోజులను గుర్తు చేస్తాయి. శ్రీలీల కూడా రవితేజతో కలిసి అదే ఉత్సాహంతో మెరిసింది. ఈ సాంగ్‌తో మేకర్స్ ఫస్ట్ చార్ట్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారనడంలో సందేహం లేదు. సినిమా విడుదలకు ముందే ఈ పాట యూత్‌లో జోష్ నింపుతోంది. మాస్ జాతర సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button