ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి

Jagan: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు, వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించా రు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, ఇతర కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు.