తెలంగాణ
Hyderabad: విషాదం.. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ KPHBలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 2013లో వేణుగోపాల్‌తో దీపికకు వివాహం అయ్యింది. అయితే కొన్నాళ్లుగా దీపికతో భర్త వేణుగోపాల్ గొడవ పడుతూఉన్నాడు.
దీంతో వేధింపులు తాళలేక దీపిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు మృతురాలు దీపిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.