తెలంగాణ
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా

గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సాయుధ బలగాల విభాగానికి వెన్నెముకగా భావించే అత్యంత కీలక నేత, గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా పోలీసుల ముందు లొంగిపోయారు. హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బర్సే దేవా అధికారికంగా సరెండర్ అయ్యారు.
దేవాతో పాటు మావోయిస్టు మిలిటరీ ఆపరేషన్ విభాగ సభ్యులు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన సమయంలో దేవా నుండి అత్యంత శక్తివంతమైన మౌంటెన్ ఎల్‌ఎమ్‌జీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టుల దగ్గర ఉండే అత్యంత కీలకమైన ఆయుధమని అధికారులు తెలిపారు.



