తెలంగాణ

Maoist Party: లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

Maoist Party: మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్ జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని భూటకపు ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు.

మారేడుమిల్లిలో ఈనెల 18, 19 తేదీల్లో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు మరో 12 మందిని పట్టుకుని, హింసించి పోలీసులు హత్య చేశారని లేఖలో ఆరోపించారు. ఈ భూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 30న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button