జాతియం

Manmohan Singh: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు..

Manmohan Singh: భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంతిమ సంస్కారాలను శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.

ఆయన మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలుపనుంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఏడు రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button