Paradise: నాని-మోహన్ బాబు జోడీతో ప్యారడైజ్ సంచలనం!

Paradise: నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. శ్రీకాంత్ ఓదెల ఇటీవల మోహన్ బాబును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఈ వార్త మరింత బలం పొందింది.
గతంలో ‘దసరా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న నాని-శ్రీకాంత్ జోడీ మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. ఈ ఏడాదిలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.