సినిమా

Manchu Manoj: మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మంచు మనోజ్

Manchu Manoj: మంచు ఫ్యామిలీలో మళ్లీ కొత్త ట్విస్ట్! మనోజ్‌కు సొంత ఇంట్లోకి ఎంట్రీ లేకుండా పోలీసులు అడ్డుకున్న సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. విష్ణుపై సంచలన ఆరోపణలు చేస్తూ మనోజ్ ఆందోళనకు దిగారు. ఏం జరిగిందంటే…

మంచు మనోజ్‌కు జల్‌పల్లిలోని నివాసంలో షాక్ తగిలింది. కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిన మనోజ్‌ను అధికారులు అడ్డుకున్నారు. విష్ణు తన కారు, వస్తువులు దొంగిలించాడంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. ఇంటి బయట ఆందోళన చేస్తూ, “నాకు నాన్నతో గొడవలు లేవు, కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు. నా కూతురు బర్త్‌డే కోసం వచ్చాం, కానీ పరిస్థితులు బాగోలేక జైపూర్ వెళ్లాం,” అని వాపోయారు. “ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వడం లేదు.

విష్ణుకి నా మీద కుల్లు, కోర్టు ఆర్డర్ ఉన్నా లోపలికి వెళ్లనివ్వడం లేదు,” అంటూ ఆరోపించారు. తప్పుడు సంతకాలతో కోర్టును మోసం చేస్తున్నారని, విష్ణు కెరీర్ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు. “ఈ కేసులో చార్జ్‌షీట్ ఎందుకు దాఖలు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేకపోయినా, పోలీసులు లోపలికి వెళ్లనివ్వడం లేదని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button