సినిమా
Manchu Manoj: మంచు మనోజ్ సెటైరికల్ ట్వీట్.. బిగ్ స్క్రీన్ లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడు

Manchu Manoj: తన సినిమాకు భయపడే ‘కన్నప్ప’ సినిమాను వాయిదా వేసుకున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. కన్నప్ప మూవీని ‘దొంగప్ప’ అంటూ జూన్ 27న బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోందని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇంతకీ రిలీజ్ తేదీ జూలై 17న లేదా జూన్ 27నా అంటూ ఎగతాళి చేశారు. వందకోట్లకు పైగా బడ్జెట్ మూవీ కదా మీ పీఆర్ ప్లానింగ్ కేక అంటూ మంచు మనోజ్ తన ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
హీరో మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాను హీరో మంచు మనోజ్ డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. ఏకంగా జూలై 27న దొంగప్ప సినిమా వస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఇక కన్నప్ప సినిమాకు పోటీగా మనోజ్ నటించిన భైరవం సినిమా విడుదల కాబోతుంది.