సినిమా
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మీ ఈడీ ముందు హాజరైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ భారీగా డబ్బులు తీసుకున్నారని మంచు లక్ష్మీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా.. ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.
సంబంధిత వివరాలు తీసుకురావాలని ఈమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు? ప్రమోషన్‌తో ఎంత లాభం చేకూరింది? తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగించనున్నారు.



