సినిమా

‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజ్ అప్డేట్?

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పాటలు వైరల్ అవుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ మాత్రం సస్పెన్స్‌గా ఉంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన ఉండవచ్చని సమాచారం.

వాయిస్ ఓవర్: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీగా హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాకు ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ ఇప్పటివరకు సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.

ఈ సస్పెన్స్‌కు త్వరలో ఫుల్ స్టాప్ పడనుందని తెలుస్తోంది. మేకర్స్ ఒక స్పెషల్ ట్రీట్‌తో కూడిన రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button