సంక్రాంతి సందడి తెచ్చేసిన మన శంకరవరప్రసాద్ గారు!

సంక్రాంతి సీజన్లో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌తో విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా థియేటర్లలో సందడి సృష్టిస్తోంది. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రావిపూడి మ్యాజిక్ మళ్లీ పనిచేసింది. చిరు కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అదరగొట్టాయి. ఈ సినిమా ఎలా సాగిందో దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి వేళ బాక్సాఫీస్ వద్ద సందడి సృష్టిస్తోంది. వరల్డ్ బిల్డింగ్ సినిమాల మధ్య సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ సాధారణమే అయినా తెరపై సన్నివేశాలు, పాత్రల మధ్య సరదా, కామెడీ టైమింగ్‌తో మమేకం చేస్తుంది. చిరంజీవిని ఎంటర్టైనర్గా మాత్రమే చూసి అనిల్ రావిపూడి కొత్తగా ఆవిష్కరించారు. ఫస్టాఫ్‌లో ఎక్కడా బోర్ కొట్టకుండా చకచకా నడిపించారు. నయనతారతో ఫ్లాష్‌బ్యాక్, పిల్లల ఎపిసోడ్, బుల్లిరాజు సీన్, ‘శశిరేఖ’ పాట అద్భుతంగా సాగాయి.
సెకండాఫ్‌లో కొంత డ్రాప్ అయినా మహిళామణుల ఎపిసోడ్‌తో మళ్లీ ఊపందుకుంది. వెంకటేష్ గెస్ట్ రోల్ ట్రీట్‌గా అనిపించింది. ఇద్దరూ కలిసి పాడిన పాటలు, ఫైట్ సీన్లు అభిమానులను ఆనందపరిచాయి. విలన్ ట్రాక్ వీక్‌గా ఉన్నప్పటికీ మొత్తం సినిమా కలర్ఫుల్గా, ఎంటర్టైనింగ్గా సాగింది. భీమ్స్ సంగీతం, పాటలు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. చిరు లుక్స్, కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి సెంటిమెంట్ పూర్తిగా వర్కౌట్ అయిన ఈ సినిమా అభిమానులకు, ప్రేక్షకులకు పండగ వైబ్స్ అందించింది.



