మన శంకరవరప్రసాద్ గారుకి రికార్డు ఓపెనింగ్స్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజే అద్భుతమైన వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా మార్కెట్‌లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ వసూళ్లు గురించి పూర్తి వివరాలు చూద్దాం.
వాయిస్ ఓవర్:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌తో రచ్చ చేస్తోంది. ప్రీమియర్స్ కలిపి మొదటి రోజుకే 84 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇది తెలుగు సీనియర్ హీరోల్లో అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. అలాగే పాన్ ఇండియా చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’తో సమానమైన ఓపెనింగ్స్ సాధించడం హిస్టారికల్ ఘటనగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను భారీగా థియేటర్లకు తీసుకొచ్చిన ఈ చిత్రం ఎంటర్‌టైనర్‌గా అదరణ పొందుతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం, నయనతార హీరోయిన్‌గా నటన, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకు బలం చేకూర్చాయి. మొదటి రోజు నుంచే హౌస్‌ఫుల్ షోలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ భారీ సక్సెస్‌తో మెగాస్టార్ కెరీర్‌లో మరో గోల్డెన్ ఫేజ్ మొదలైనట్లుగా అభిమానులు ఆనందిస్తున్నారు. లాంగ్ రన్‌లో ఇంకా అనేక రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



