జాతియం

ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ .. తృటిలో తపించుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్‌ గా మారిన దృశ్యాలు

Mumbai: ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్‌ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ పైప్‌ ఊడిపోయింది. దానిని తిరిగి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పైపులో నుంచి గ్యాస్‌ ఎగజిమ్మడంతో సాధ్యం కాలేదు. దీంతో సిలిండర్‌ను కిచెన్‌లో నుంచి బయటకు తెచ్చి హాల్‌లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది.

సిలిండర్‌ కిందపడి ఉండడంతో పైప్‌ నుంచి లీక్‌ అయిన గ్యాస్‌ ఇళ్లంతా వ్యాపించింది. కొన్ని క్షణాలకు గ్యాస్‌ రావడం ఆగిపోవడంతో ఇంట్లోకి వచ్చిన ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను అక్కడినుంచి తీయడానికి ప్రయత్నించింది.

అంతలోనే క్షణాల్లో పెద్దఎత్తున పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. తెరిచి ఉన్న రెండు తలుపుల నుంచి వెంటనే వారిద్దరూ ఒక్క ఉదుటన బయటకు పారిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వారి ఇంట్లోని హాలులో ఉన్న సీసీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button