తెలంగాణ
Karimnagar: రూ.4.14కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం అన్నను చంపిన తమ్ముడు

Karimnagar: ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. రామడుగు గ్రామానికి చెందిన నరేష్ 1.5 కోట్ల అప్పులపాలయ్యాడు.
అయితే అప్పుల నుంచి బయటపడేందుకు మానసిక పరిపక్వత లేని తన అన్న వెంకటేష్‌ను చంపాలని ప్లాన్ చేశాడు. మానసిక పరిస్థితి సరిగా లేని వెంకటేశ్ పేరుపై 4.14 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అందుకే అన్న చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించిన నరేష్ తన స్నేహితుడి, టిప్పర్ డ్రైవర్‌తో కలిసి వెంకటేశ్‌ను హత్యకు పాల్పడ్డారు.



