తెలంగాణ
దారుణం.. శ్రీ బాలాజీ ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యానికి వచ్చిన వ్యక్తిని విగతజీవిగా పంపించడంతో ఆసుపత్రి యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.