తెలంగాణ
ఓఆర్ఆర్పై కారులో మంటలు.. సజీవదహనమైన డ్రైవర్

మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఎకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. శామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.



