ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: మురళి నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పవన్

Pawan Kalyan: మురళి నాయక్ కుటుంబానికి ఇచ్చిన హామీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే మురళీ నాయక్ అంత్యక్రియలకు పాల్గొన్న పవన్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక వారి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు.
ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, నిమ్మల జయకృష్ణ మురళీ నాయక్ ఇంటికి వెళ్లి చెక్కు అందించారు. కూటమి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యేలు అన్నారు.