తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం.. సెలూన్‌లో హెయిర్ కట్ చేసిన మల్లారెడ్డి

Mallareddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రచారం చేశారు. ఓ టీ కొట్టులో వినియోగదారులకు చాయ్ అందించారు. సెలూన్‌లో ఓ వ్యక్తికి మల్లారెడ్డి హెయిర్ కట్ చేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం చెంపలు రుద్దుతూ మళ్లీ వస్తానంటూ సందడి చేసి వెళ్లిపోయారు.



