తెలంగాణ
Mulugu: కుంగిన మల్లంపల్లి బ్రిడ్జి

ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాల్వపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయి కూలుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల దారిమళ్లింపు చేపట్టారు. ములుగు నుండి వరంగల్ వెళ్లే వాహనాలు వయా అబ్బాపూర్, రేగొండ, పరకాల గుడేపాడు వైపు మళ్లించారు. హనుమకొండ నుండి ములుగు వచ్చే వాహనాలు గుడేపాడ్, రేగొండ అబ్బాపూర్, ములుగు నుండి వెళ్లాలని పోలీసులు సూచించారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.



