Ghattamaneni Jaya Krishna: ఘట్టమనేని వారసుడితో అదిరిపోయే కథ!

Ghattamaneni Jaya Krishna: ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ సాగనుంది. హిందూ పుణ్యక్షేత్రంలో జరిగిన సంఘటన ఆధారంగా కథ నడుస్తుంది. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా తెలుగులో అరంగేట్రం చేస్తోంది.
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రాన్ని లెజెండరీ సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే అధికారిక అప్డేట్ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది.
విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కథాంశం రూపొందుతుందని సమాచారం. చిత్రంలో మెయిన్ కథాంశం చాలా కొత్తగా ఉంటుందని, ఎమోషనల్ డ్రామా బాగుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతోనే రాషా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టనుంది. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



