మోదీ బయోపిక్‌లో ఉన్ని ముకుందన్‌కు సమన్లు!

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘మా వందే’ సినిమా తెరకెక్కుతోంది. మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. సినిమా పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. అయితే, ఉన్ని ముకుందన్‌పై దాడి కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాలు చూద్దాం.
‘మా వందే’ సినిమా ప్రధాని మోదీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తుంది. ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే, ఆయన మాజీ మేనేజర్ విపిన్ కుమార్‌పై దాడి చేశారన్న ఆరోపణతో కేరళలోని కాకనాడ్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.
పోలీసుల విచారణలో సీసీ టీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, మొబైల్ టవర్ డేటాను సేకరించారు. అయితే, సీసీ టీవీలో దాడి ఆధారాలు లేవని, విపిన్ ఆరోపణలు అవాస్తవమని పోలీసులు తెలిపారు. కేసు చివరి దశలో ఉంది. సోషల్ మీడియాలో ఉన్నికి మద్దతుగా ప్రచారం జరుగుతుంది. కొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం ఎటు మళ్లుతుందో చూడాలి.



