సినిమా

Malaika Arora: నచ్చిన వారితో శృంగారం.. తప్పేంటంటున్న సల్మాన్ మరదలు?

Malaika Arora: బాలీవుడ్ సీనియర్ నటి, సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్, ఫ్యాషన్‌లో దూసుకుపోతున్న ఈ బోల్డ్ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరొందిన మలైకా అరోరా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మలైకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉందని చెప్పింది.

మనసుకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడంలో తప్పు లేదని, దానికి పెళ్లి అవసరం లేదని స్పష్టం చేసింది. స్వేచ్ఛగా జీవించడమే ముఖ్యమని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను చర్చకు దారితీశాయి. కొందరు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా సమర్థిస్తుండగా, మరికొందరు పబ్లిక్ ఫిగర్‌గా ఇలాంటి మాటలు చెప్పడం సరికాదని విమర్శిస్తున్నారు. మలైకా ఎప్పటినుంచో తన జీవితాన్ని బోల్డ్‌గా గడుపుతూ ఫిట్‌నెస్, ఫ్యాషన్‌లో ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో మరోసారి ఆమె హైలైట్ అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button