తెలంగాణ
హూస్నాబాద్‌లో మాల మహానాడు ధర్నా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు యత్నించారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా రాష్ట్రంలో ఆశాస్త్రీయంగా జనాభా లెక్కలు లేకుండా ఎస్సీ వర్గీకరణ చేశారని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. జీవో 99 సవరించి రోస్టర్ పాయింట్‌ను 16 నుండి 22కు పెంచడంతో మాల విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాత్రి నుండి తమ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. మాలలకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెబుతామనిహెచ్చరించారు.



