తెలంగాణ
హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. 9 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కాగా డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ సరఫరా చేస్తున్న ఆరుగురు, మెఫిడ్రీన్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 పిల్స్, కంట్రీమేడ్ గన్, 12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు విలువ 85 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన శిక్షలు అమలుచేస్తామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.